Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 45

Sagara manthan!

బాలకాండ
నలుబది అయిదవసర్గము
( క్షీరసాగర మథనము - దేవాసుర సంగ్రామము)

విశ్వామిత్రః వచశ్రుత్వా రాఘవః సహ లక్ష్మణః |
విస్మయం పరమం గత్వా విశ్వామిత్రం అథాబ్రవీత్ ||

స|| అథః రాఘవః సహ లక్ష్మణః విశ్వామిత్రస్య వచః శ్రుత్వా పరమం విస్మయం గత్వా విశ్వామిత్రం అబ్రవీత్ |

తా|| విశ్వామిత్రుని వచనములను వినిన లక్ష్మణునితోగూడిన రాఘవుడు అమితాశ్చర్యముతో విశ్వామిత్రునితో ఇట్లనెను.

అత్యద్భుతమిదం బ్రహ్మన్ కథితం త్వయా |
గంగావతరణం పుణ్యం సాగరస్యాపి పూరణమ్ ||

స|| (హే) బ్రహ్మన్ ! ఇదం పుణ్యం గంగావతరణం సాగరస్య అపి పూరణం త్వయా కథితం అతి అద్భుతం |

తా|| ఓ బ్రహ్మన్ ! మీచే చెప్పబడిన ఈ పుణ్యమైన గంగావతరణము , సాగరము యొక్క పూర్తి చాలా అద్భుతమైనవి.

తస్య సా శర్వరీ సర్వా సహసౌమిత్రిణా తదా ||
జగామ చింతయానస్య విశ్వామిత్ర కథాం శుభామ్ ||

స|| విశ్వామిత్రస్య శుభాం కథాం సౌమిత్రిణా సహ చింతయానస్య తస్య సా శర్వరీ జగామ |

తా|| విశ్వామిత్రునిచే చెప్పబడిన శుభమైన కథలను గురించి లక్ష్మణునితో కూడి రాముడు ఆలోచించుచూ ఉండగా ఆ రాత్రి గడిచిపోయెను.

తతః ప్రభాతే విమలే విశ్వామిత్రం మహామునిమ్
ఉవాచ రాఘవో వాక్యం కృతాహ్నిక మరిందమ ||

స|| తతః విమలే ప్రభాతే కృతాహ్నికం విశామిత్రం మహామునిం అరిందమః రాఘవః వాక్యం ఉవాచ |

తా|| పిమ్మట ప్రశాంతమైన ప్రభాతసమయములో శత్రుభయంకరుడైన రాముడు ప్రభాతకార్యక్రములను ముగించి మహాముని విశ్వామిత్రునితో ఇట్లు పలికెను.

గతా భగవతీరాత్ర్రిః శ్రోతవ్యం పరమంశ్రుతమ్ |
క్షణభూతేన నౌ రాత్రిః సంవృత్తేయం మహాతపః |
ఇమాం చింతయితః సర్వాం నిఖిలేన కథాం తవ ||
తరామ సరితాం శ్రేష్ఠాం పుణ్యాం త్రిపథగాం నదీమ్ ||

స|| హే మహాతపః ! భగవతీ కథా పరమం శ్రోతవ్యం శ్రుతమ్. ఇమాం చింతయితః తవ సర్వాం కథాం నిఖిలేన సంవృతేయం క్షణభూతేన నౌరాత్రిః| సరితాం శ్రేష్ఠాం నదీం పుణ్యాం త్రిపథగాం తరామ |

తా|| "ఓ మహామునీ ! ఉత్తమమైన వినతగిన కథ వినడమైనది. పవిత్రమైన రాత్రి గడిచి పోయినది. ఈకథలను గురించి అలోచించుచూ మననము చేయుటలో రాత్రి క్షణములో గడిచి పోయినది. ఇప్పుడు నదులలో శ్రేష్ఠమైన త్రిపథను దాటుదము".

నౌ రేషా హి సుఖా స్తీర్ణా ఋషీణాం పుణ్యకర్మణామ్ |
భగవంత మిహ ప్రాప్తం జ్ఞాత్వా త్వరిత మాగతా ||

స|| ఏషా పుణ్యకర్మణాం ఋషీణాం సుఖా నౌకా ప్రాప్తం | భగవంతం ఇహా జ్ఞాత్వా త్వరితమ్ ఆగతా |

తా|| "పుణ్యకర్మలను చేయు ఋషుల సుఖమైన నావ వున్నది. భగవత్సమానులైన మీరు ఇచట ఉన్నారని తెలిసి ఆ నావ త్వరగా వచ్చినది".

తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః |
సంతారం కారయామాస సర్షిసంఘస్సరాఘవః ||

స|| (సః) మహాత్మనః తస్య రాఘవస్య తత్ వచనం శ్రుత్వా స ఋషిసంఘః స రాఘవః సంతారం కారయామాస |

తా|| "ఆ మహాత్ముడైన విశ్వామిత్రుడు అ రాఘవుని యొక్క వచనములను విని ఋషి సంఘములతో రామలక్ష్మణులతో నదిని దాటెను.

ఉత్తరం తీరమాసాద్య సంపూజ్యర్షిగణం తదా |
గంగాకూలే నివిష్టాస్తే విశాలాం దదృశుః పురీమ్ ||

స|| ఉత్తరం తీరం ఆసాద్య తదా ఋషిగణం సంపూజ్య గంగాకూలే నివిష్ఠాః తే విశాలం పురీం దదృశుః |
తా|| ఉత్తర తీరమును చేరి ఋషిగణములను పూజించి 'విశాల" అనబడు నగరమును చూచిరి.

తతో మునివరస్తూర్ణం జగామ సహ రాఘవః |
విశాలాం నగరీం రమ్యాం దివ్యాం స్వర్గోపమాం తదా ||

స|| తతః మునివరః రమ్యాం దివ్యం స్వర్గోపమాం నగరీం విశాలం రాఘవ సహ తూర్ణం జగామ |

తా|| అప్పుడు ఆ మునివరుడు రమ్యమైన దివ్యమైన స్వర్గముతో సమానమైన విశాల నగరమునకు రాఘవునితోసహా వెళ్ళిరి.

అథ రామో మహప్రాజ్ఞో విశ్వామిత్రం మహామునిమ్ |
ప్రపచ్ఛ ప్రాంజలిర్భూత్వా విశాలం ఉత్తమాం పురీమ్ ||

స|| అథ మహాప్రాజ్ఞో రామః విశ్వామిత్రం మహామునిం ప్రాంజలిం భూత్వా ప్రపచ్ఛఉత్తమాం పురీం విశాలం |

తా|| అప్పుడు మహాప్రాజ్ఞుడైన రాముడు మహాముని అగు విశ్వామిత్రునికి అంజలి ఘటించి ఉత్తమమైన విశాల నగరము గురించి అడగ సాగెను.

కతరో రాజవంశో యం విశాలాయాం మహామునే |
శ్రోతు మిచ్ఛామి భద్రం తే పరం కౌతూహలం హి మే ||

స|| (హే) మహామునే తే భద్రం | యం విశాలాయాం కతరో రాజవంశో శ్రోతుం ఇచ్ఛామి | మే పరం కౌతూహలం హి |

తా|| ఓ మహాముని ! నీకు క్షేమమగుగాక . ఈ విశాలా నగరములో ఏ రాజవంశము పాలించున్నదో వినుటకు కోరిక గానున్నది. ఇది వినుటకు కుతూహలముగా నున్నది.

తస్య తద్వచనం శ్రుత్వా రామస్య మునిపుంగవః |
ఆఖ్యాతుం తత్సమారేభే విశాలస్య పురాతనమ్ ||

స|| తస్య రామస్య తత్ వచనం శ్రుత్వా (సః) మునిపుంగవః తత్ విశాలస్య పురాతనం ఆఖ్యాతుం సమారభే |

తా|| ఆ రామునియొక్క ఆ మాటలను వినిన ఆ మునిపుంగవుడు ఆ విశాల నగరముయొక్క వురాతనమైన కథను చెప్పుటకు సిద్ధమాయెను.

శ్రూయతాం రామ శక్రస్య కథాం కథయతశ్శుభామ్ |
అస్మిన్ దేశే తు యద్వృత్తం తదపి శృణు రాఘవ ||

స|| హే రామ ! శక్రస్య శుభాం కథాం అస్మిన్ దేశే యద్వృత్తం తదపి కథయతః హే రాఘవా శ్రుణు |

తా|| 'ఓ రామా |ఇంద్రునియొక్క శుభమైన కథను , ఈ దేశములో జరిగిన వృత్తాంతమును వినిపించెదను. ఓ రాఘవా వినుము'.

పూర్వం కృత యుగే రామ దితేః పుత్త్రాః మహాబలాః |
అదితేశ్చ మహాభాగ వీర్యవంతః సుధార్మికాః ||

స|| హే రామా ! పూర్వం కృతయుగే దితేః పుత్రాః మహాబలాః ! అదితేశ్చ ( పుత్రాః) మహాభాగ వీర్యవంతః సుధార్మికాః |
తా|| 'ఓ రామా ! పూర్వము కృతయుగములో దితి యొక్క పుత్రులు మహాబలవంతులు. అదితి యొక్క పుత్రులు మహాభాగులు వీరులు ధర్మము చేయువారు'.

తతస్తేషాం నరశ్రేష్ఠ బుద్ధిరాసీన్మహాత్మనామ్ |
అమరా అజరాశ్చైవ కథం స్యామ నిరామయః ||

స|| హే నరశ్రేష్ఠా ! తతః తేషాం మహాత్మనామ్ అమరా అజరశ్చ ఏవ నిరామయః కథం స్యామ (ఇతి) బుద్ధిరాసీత్ |

తా|| ఓ నరశ్రేష్ఠా | అప్పుడు వారికి అమరులు , ముసలితనములేనివారు, రోగములు లేనివారుగా అగుట ఏట్లు అని ఆలోచనవచ్చెను.

తేషాం చింతయతాం రామ బుద్ధిరాసీన్మహాత్మనామ్ |
క్షీరోదమథనం కృత్వా రసం ప్రాప్స్యామ తత్ర వై ||

స|| హే రామ ! (ఇతి) చింతయతాం తేషాం మహాత్మనాం క్షీరోదమథనం కృత్వా రసం ప్రాప్స్యామ తత్ర వై (ఇతి) బుద్ధిరాసీత్ |

తా|| 'ఓ రామా అట్లు అలోచించుచున్న వారికి క్షీరసాగరము మథించి దానినుంచి వచ్చిన రసము పొందుదము అని ఆలోచన కలిగెను'.

తతో నిశ్చిత్య మథనం యోక్త్రం కృత్వాచ వాసుకిమ్ |
మంథానం మందరం కృత్వా మమంథరమితౌజసః ||

స|| (తే) అమితౌజసః తతో నిశ్చిత్య వాసుకీమ్ యోక్త్రం కృత్వా మందరం మంధానం కృత్వా మమంధర |

తా|| 'మిక్కిలి శక్తి సంపన్నులైన ఆ దేవ దానవులు వాసుకిని తాడుగను మందరపర్వతమును కవ్వముగను చేసి క్షీరసాగరమును చిలికిరి'.

అథ వర్ష సహస్రేణ యోక్త్రసర్పశిరాంసి చ |
వమంత్యతి విషం తత్ర దదంశుర్దశనై శ్శిలాః ||

స|| అథ సహస్రేణ వర్ష ( పర్యంతం ) యోక్త్ర సర్ప శిరాంసి విషం వమంత్యతి దశనైః శిలాః దదంశు చ |

తా|| 'వేయి సంవత్సరముల తరువాత తాడుగా నియీజింపబడిన వాసుకి శిరస్సునుంచి ఇషములు గ్రక్కెను, తన దంతములతో శిలలను కాటువేయసాగెను".

ఉత్పపాతాగ్ని సంకాశం హాలాహల మహావిషమ్ |
తేన దగ్ధం జగత్ సర్వం సదేవాసురమానుషమ్ ||

స|| హాలా హల మహావిషం అగ్ని సంకాశం ఉత్పపాత | తేన దేవాసురమానుషం సర్వం జగత్ దగ్ధం |
తా|| 'ఆ హాలా హల మగు మహావిషము నుంచి అగ్ని ఉద్భవించెను. దానిచే దేవాసుర మనుష్యులతోకూడిన జగత్తు అంతయు దగ్ధమయ్యెను'.

అథ దేవా మహాదేవం శంకరం శరణార్థినః |
జగ్ముః పశుపతిం రుద్రం త్రాహిత్రాహీతి తుష్టువుః ||
ఏవముక్తోస్తతో దేవైః దేవదేవేశ్వరః ప్రభుః |
ప్రాదురాసీత్ తతోsత్రైవ శంఖ చక్రధరో హరిః ||

స|| అథ శరణార్థినః దేవాః మహాదేవం శంకరం పశుపతిం రుద్రం త్రాహి తాహి ఇతి తుష్టువుః | తతః ఎవం ఉక్తో దెవైః దేవదేవేశ్వరః ప్రభుః (శంకరః) జగ్ముః || తత్రైవ శంఖచక్రధరో హరిః ( జగ్ముః) ||

తా|| 'అప్పుడు దేవతలందరూ శరణార్థులై మహాదేవుడు పశుపతి శంకరుడు అనబడు రుద్రుని "రక్షింపుము" "రక్షింపుము" అని ప్రార్థన చేసిరి. దేవతలచే ఈ విధముగా ప్రార్థింపబడిన దేవతలకు ఈశ్వరుడైన శంకరుడు అచటికి వచ్చెను. అచటికే శంఖచక్రములు ధరించిన శ్రీహరి కూడా వచ్చెను.'

ఉవాచైనం స్మితం కృత్వా రుద్రం శూలభృతం హరిః |
దైవతైర్మధ్యమానే తు యత్పూర్వం సముపస్థితమ్ ||
తత్ త్వదీయం సురశ్రేష్ఠ సురాణామగ్రజోs సి యత్ |
అగ్రపూజమిమాం మత్వా గృహేణేదం విషం ప్రభో ||

స|| హరిః స్మితం కృత్వా శూలభృతం రుద్రం ఉవాచ | (హే) సురశ్రేష్ఠ యత్ త్వదీయం సురాణాం అగ్రజోసి దేవతైర్మధ్యమానేతు యత్పూర్వం సముపస్థితం తత్ ఇమాం అగ్రపూజం మత్వా ఇదం విషం గృహాణ |

తా|| 'అప్పుడు శ్రీహరి మందహాసముతో శూలము ధరించిన రుద్రునితో ఇట్లనెను. " ఓ సురశ్రేష్ఠ ! నీవు సురలలో అగ్రజుడివి. కనుక దేవదానవక్షీరమథనములో మొదటగా వచ్చిన విషమును అగ్రపూజగా భావించి దానిని స్వీకరింపుము" అని.

ఇత్యుక్త్వాచ సురశ్రేష్ఠః తత్రైవాంతరధీయత|
దేవతానాం భయం దృష్ట్వా శ్రుత్వా వాక్యంతు శార్జ్ఞిణః ||
హాలాహలం విషం ఘోరం స జగ్రాహామృతోపమమ్ |
దేవాన్ విశ్రుజ్య దేవేశో జగామ భగవాన్ హరిః ||

స|| ఇత్యుక్త్వా సురశ్రేష్ఠః తత్ర ఏవ అంతరధీయత | శార్జ్ఞ్ణిణః వాక్యం తు శ్రుత్వా దేవతానాం భయం దృష్ఠ్వా హాలాహలంఘోరం విషం అమృతోపమమ్ ( మత్వా) జగ్రాహ | దేవేశో భగవాన్ హరిః దేవాన్ విశ్రుజ్య జగామ|

తా|| 'ఈ విధముగా చెప్పి అ సురశ్రేష్ఠ ( మహావిష్ణువు) అంతర్ధానమయ్యెను. పరమేశ్వరుడుకూడా మహావిష్ణువు మాటలు విని , దేవతల భయము చూచి ఘోరమైన హాలాహలమనబడు విషమును అమృతముతో సమానముగా గ్రహించెను. పిమ్మట దేవతలకు ఈశ్వరుడైన ఆ భగవన్ ఆ దేవతలను వీడి వెళ్ళిపోయెను'.

తతో దేవాన్ సురాస్సర్వే మమంథూ రఘునందన |
ప్రవివేశాథ పాతాళం మంథానః పర్వతోsనఘ ||

స|| హే రఘునందన ! అనఘ ! తతః దేవాన్ సురాః అసురా సర్వే మమంథూ | అథః పర్వతః మంథానః పాతాళం ప్రవివేశ |

తా|| 'ఓ రఘునందన ! ఓ అనఘా! అప్పుడు దేవతలూ అసురులు అందరూ మళ్ళీ క్షీరసముద్రము చిలకసాగిరి. అప్పుడు కవ్వముగా నియోగించబడిన పర్వతము పాతాళములో ప్రవేశించెను".

తతో దేవాస్సగంధర్వాః తుష్టువుర్మధుసూదనమ్ |
త్వం గతిస్సర్వభూతానాం విశేషేణ దివౌకసామ్ ||

స|| తతః దేవాః స గంధర్వాః మధుసూదనం తుష్ఠువుః | సర్వభుతానాం త్వం గతిః | విశేషేణ దివౌకసాం |

తా|| 'అప్పుడు దేవతలు గంధర్వులతో సహా మధుసూదనుని ప్రస్తుతించిరి." అన్ని భూతములకు నీవే గతి . ముఖ్యముగా దేవతలకు "

పాలయాస్మాన్ మహాబాహో గిరిముద్ధర్తుమర్హసి |
ఇతిశ్రుత్వా హృషీకేశః కామఠం రూపమాస్థితః ||

స|| హే మహాబాహో (త్వం) గిరి ముద్ధర్తుం అర్హసి | అస్మాన్ పాలయ ఇతి | హృషీకేశః ఇతి శ్రుత్వా కామఠం రూపమాస్థితః |

తా|| "ఓ మహాబాహో ! నీవు ఆ పర్వతమును ఉద్ధరించుటకు తగినవాడవు". అప్పుడు భగవంతుడైన హృషీకేశుడు కూర్మరూపమును ధరించెను'.

పర్వతం పృష్ఠతః కృత్వా శిశ్యే తత్రో దధౌ హరిః |
పర్వాతాగ్రంతు లోకాత్మా హస్తేనాక్రమ్య కేశవః |
దేవానాం మధ్యతః స్థిత్వా మమంథ పురుషోత్తమః ||

స|| హరిః పర్వతం పృష్ఠతః కృత్వా తత్రః దధౌ శిశ్యే | పర్వతాగ్రంతు హస్తేన ఆక్రమ్య దేవానాం మధ్యే స్థిత్వా పురుషోత్తమః కేశవః మమంథ |

తా|| 'ఆ శ్రీహరి పర్వతమును తన మూపున వహించి ఆ క్షీరసాగరములో శయనించెను. ఆ పురుషోత్తముడు పర్వతాగ్రమును తన చేతితో తిప్పుచూ దేవతల మధ్యలో నుండి క్షీరసాగర మథనమును చేయసాగెను".

అథ వర్ష సహస్రేణ సదండః సకమండలుః |
పూర్వం ధన్వంతరిర్నామ అప్సరాశ్చ సువర్చసః ||

స|| అథ సహస్రేణ వర్షే ( పర్యంతం) పూర్వం ధన్వంతరీ నామః సదండః సకమండులుః ( తత్ పశ్చాత్) సువర్చసః అప్సరాశ్చ |

తా|| 'ఒక వేయి సంవత్సరముల పిమ్మట మొదట దండ కమండలములతో గూడిన ధన్వంతరీ అనబడు మహాపురుషుడు , ఆతరువాత మంచి వర్చస్సు గల అప్సరసలు ఉద్భవించిరి".

అప్సు నిర్మథనాదేవ రసస్తస్మాత్ వరస్త్రియః |
ఉత్పేతుర్మనుజశ్రేష్ఠ తస్మాత్ అప్సరసోs భవన్ ||

స|| (హే) మనుజ శ్రేష్ఠ ! అప్సు నిర్మథనాదేన రసః , తస్మాత్ ఉత్పేతుః వరస్త్రియః | తస్మాత్ అప్సరసో అభవన్ |

తా|| ఓ మనుజశ్రేష్ఠా ! "అప్సు" మథనము చేయుటవలన వచ్చిన రసము నుంచి ఉద్భవించిన వరింపదగిన వనితలు కనుక వారు అప్సరసలు అనబడిరి.

షష్టిః కోట్యో భవంస్తాసామ్ అప్సరాణాం సువర్చసామ్ |
అసంఖ్యేయాస్తు కాకుత్ స్థ యా స్తాసాం పరిచారికాః ||

స|| హే కాకుత్ స్థ ! తాసాం షష్టి కోట్యో సువర్చసాం అభవం తాసాం అసంఖ్యేయాస్తు పరిచారికాః |

తా|| 'ఓ కకుత్ స్థ! ఆ ఆరుకోట్ల సువర్చసలతో అసంఖ్యాకులైన పరిచారికలు కుడా ఉద్భవించిరి".

న తాః స్మ ప్రతిగృహ్ణంతి సర్వే తే దేవ దానవాః |
అప్రతిగృహ్ణాత్ తాశ్చ సర్వాః సాధారణాః స్మృతాః ||

స|| తే సర్వే దేవదానవాః న ప్రతిగృహ్ణంతి స్మ |తాశ్చ అప్రతిగృహ్ణాత్ సర్వాః సాధారణాః స్మృతాః |

తా|| 'ఆ దేవ దానములందరూ వారిని గ్రహింపలేదు. వారిని స్వీకరించకపోవుటవలన వారందరూ సాధారణ అప్సరసలు గా వుండిపోయిరి".

వరుణస్య తతః కన్యా వారుణీ రఘునందన |
ఉత్పపాత మహాభాగా మార్గమాణా పరిగ్రహమ్ ||

స|| హే రఘునందన !తతః వరుణస్య కన్యా వారుణీ మహాభాగా పరిగ్రహం మార్గమాణా ఉత్పపాత |

తా|| 'ఓ రఘునందనా ! అప్పుడు వరుణుని యొక్క కన్య వారుణీ ఒక మహాభాగుని వెదుకు మార్గములో క్షీరసముద్రమునుంచి బయటికి వచ్చెను".

దితేః పుత్రా న తాం రామ జగృహుః వరుణాత్మజామ్ |
అదితేస్తు సుతా వీర జగృహుః తామనిందితామ్ ||

స|| హే రామా ! వీర ! తాం వరుణాత్మాజామ్ దితే పుత్రాః న జగృహుః | అదితేస్తు సుతా తాం అనిందితాం జగృహుః |

తా||' ఓ రామా ఓ వీరా ! ఆ వరుణిని పుత్రికను దితియొక్క పుత్రులు స్వీకరించలేదు. ఆ అనిందిత అయిన ఆమెను అదితి యొక్క పుత్రులు స్వీకరించిరి".

అసురాస్తేన దైతేయా సురాస్తేనాదితే స్సుతాః |
హృష్టాః ప్రముదితాశ్చాసన్ వారుణీ గ్రహణాత్ సురాః ||

స|| తేన దైతేయా అసురాః అదితేః సుతాః సురాః | వారుణీ గ్రహణాత్ సురాః హృష్టాః ప్రముదితాః ఆసన్ |

తా|| 'అందువలన దితి యొక్క పుత్రులు అసురులు . అదితి యొక్క పుత్రులు సురులు అనబడిరి. వారుణీని స్వీకరించిన సురలు సంతృప్తులై ఆనందపడిరి".

ఉచ్ఛైశ్శ్రవా హయశ్రేష్ఠో మణిరత్నం చ కౌస్తుభం |
ఉదతిష్ఠత్ నరశ్రేష్ఠ తథైవామృత ముత్తమమ్ ||

స|| హే నరశ్రేష్ఠ ! హయశ్రేష్ఠో ఉచ్ఛైశ్రవా , మణిరత్నం కౌస్తుభం చ ఉదతిష్ఠత్ | తథైవ ముత్తమమ్ అమృతం ( ఉదతిష్ఠత్ !)|

తా|| 'ఓ నరశ్రేష్ఠా ! హయములలో శ్రేష్ఠమైన ఉచ్చైశ్రవము , రత్నములలో మణి అయిన కౌస్థుభము ( క్షీర సముద్రమునుంచి) ఉద్భవించెను. అటులనే ఉత్తమమైన అమృతము ఉద్భవించెను".

అథ తస్య కృతే రామ మహానాసీత్ కులక్షయః |
అదితేస్తు తతః పుత్త్రాదితేః పుత్త్రాన్ అసూదయన్ ||

స|| హే రామ ! అథ తస్య కృతే మహాన్ కులక్షయః ఆసీత్ | తతః అదితేస్తు పుత్రాః దితేః పుత్రాః అసూదయన్ |

తా|| 'ఓ రామా ! ఆ అమృతము ఉద్భవించినపుడు మహా యుద్ధమాయెను. అప్పుడు అదితి పుత్రులు దితిపుత్రులను సంహరించిరి.

ఏకతో అభాగ్యమన్ సర్వే హ్యాసురా రాక్షసైస్సహ |
యుద్ధమాసీన్మహాఘోరం వీర త్రైలోక్యమోహనమ్ ||

స|| హే వీరా ! సర్వే అసురా రాక్షసైః సహ ఏకతో అభ్యాగమన్ మహా ఘోరం త్రైలోక్యమోహనం యుద్ధం ఆసీత్ |

తా|| 'ఓ వీరా ! అసురులందరూ రాక్షసులతో కూడి ఒక పక్షమున వుండగా ముల్లోకములకు అశ్చర్యము కలగించు యుద్ధము జరిగెను'.

యదా క్షయం గతం సర్వం తదా విష్ణుర్మహాబలః |
అమృతం సోsహరత్ తూర్ణం మాయామాస్థాయమోహినీమ్||

స|| యదా సర్వే క్షయం గతం తదా మహాబలః విష్ణుః మాయాం మోహినీం ఆస్థాయ అమృతం స అహరత్ |

తా||'అప్పుడు అంతా క్షయమగుచుండగా మహాబలవంతుడగు మహావిష్ణువు మోహినీ రూపముధరించి ఆ ఆమృతమును తీసుకుపోయెను.'

యే గతాభిముఖం విష్ణుమ్ అక్షయం పురుషోత్తమమ్ |
సంపిష్టాస్తే తదా యుద్ధే విష్ణునా ప్రభవిష్ణునా ||

స|| అక్షయం పురుషోత్తమం విష్ణుం యే అభిముఖం గతా తదా ప్రభవిష్ణునా విష్ణునా యుద్ధే తే సంపిష్టాః |

తా|| 'అక్షయుడు పురుషోత్తముడైన విష్ణువును కొందరు ఎదిరించిరి. ప్రభవిష్ణుడగు విష్ణువు యుద్ధములో వారిని సంహరించెను".

అదితేరాత్మజా వీరా దితేః పుత్త్రాన్ ని జఘ్నిరే|
తస్మిన్ ఘోరే మహాయుద్ధే దైతేయాదిత్యయోర్భృశమ్||

స|| హే వీర తస్మిన్ దైతేయాః అదిత్యయోః భృశం ఘోరే మహాయుద్ధే అదితేః ఆత్మజాః దితేః పుత్రాన్ ని జఘ్నిరే |

తా|| 'ఓ వీరా అదితి దితిల పుత్రుల ఘోర యుద్ధములో అదితియొక్క పుత్రులు దితియొక్క పుత్రులను సంహరించిరి'.

నిహత్యదితపుత్త్రాంశ్చ రాజ్యంప్రాప్య పురందరః |
శశాస ముదితో లోకాన్ సర్షి సంఘాన్ స చారణాన్ ||

స|| పురందరః దితి పుత్రాం చ నిహత్య రాజ్యం ప్రాప్య ముదితో స ఋషిసంఘాన్ స చారణాన్ లోకాన్ శశాస |

తా|| 'పురందరుడు ( ఇంద్రుడు) దితి పుత్రులను సంహరించి రాజ్యము పొంది సంతోషముతో ఋషిసంఘములతో చారణులతో కూడిన లోకములను శాసించెను'.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే పంచ చత్వారింశ స్సర్గః ||
సమాప్తం||


|| om tat sat ||